Good News: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా స్కూళ్లు, పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో.. భక్తులు క్యూ కడుతున్నారు. భారీగా భక్తులు వస్తుండడంతో కంపార్టుమెంట్లు అన్నీ కిటకిట లాడుతున్నాయి. భక్తులు భారీగా తరలిరావడంతో శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12గంటల పైనే పడుతోంది. ఇక హుండీ ఆదాయం కూడా రికార్డు స్థాయిలో వస్తోంది.
గతేడాది వరకు కరోనా నిబంధనలతో తిరుల పుణ్యక్షేత్రం భక్తులు లేక వెలవెల పోయేది. పరిమిత సంఖ్యలోనే భక్తులు అనుమతించేవారు.. కరోనా నిబంధనలు కూడా కఠినంగానే అమలు చేసేవారు. దీంతో రెండేళ్ల పాటు చాలామంది..శ్రీవారిని దర్శించుకోలేకపోయారు. ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో అంతా శ్రీవారి చెంతకు పరుగులు తీస్తున్నారు.
భక్తుల డిమాండ్ ను బట్టి తాజా మరో శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఆగస్టు నెలకు సంబంధించిన అన్ని టికెట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.. మొత్తం టికెట్లు అన్ని ఆన్ లైన్ లోనే విడుదల చేయనుంది. ఇప్పటికే ఆన్లైన్లో టికెట్ల బుకింగ్‌కు భారీ డిమాండ్ ఉండగా.. నిమిషాల వ్యవధిలోనే అని టికెట్లు బుక్అవుతున్నాయి.
ఇక, లక్కీ డిప్ ద్వారా సుప్రభాతం, తోమాల, అర్చన, అర్జిత సేవా టిక్కెట్లను పొందేందుకు కూడా.. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వరకు భక్తులు ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది టీటీడీ. ఆగస్టు మాసానికి సంబంధించిన కోటాను భక్తులు లక్కీ డిప్ ద్వారా పొందే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.
ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో పెట్టిన రెండు గంటల్లోనే మూడు లక్షల 50 వేల టికెట్లు బుక్ చేసుకున్నారు. రోజుకు 25 వేల టికెట్లను టీటీడీ అందుబాటులో ఉంచింది. మొత్తం 13.35 లక్షల టికెట్లకుగాను ఫస్ట్ రెండు గంటల్లోనే రికార్డు స్థాయిలో బుక్ అయ్యాయి. మరి రేపటి నుంచి విడుదల చేయనున్నసేవలకు ఎలాంటి డిమాండ్ ఉంటుందో చూడాలి.