TTD Alert: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి (Lord Venkateswara Swamy) భక్తులకి మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam).. భక్తుల డిమాండ్.. సౌకర్యం మేరకు.. డిసెంబర్ నెలకు సంబంధించిన వర్చువల్ ఆర్జిత సేవా టికెట్ల కోటాను నేటి ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.
ఇందులో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవల్లో పాల్గొనే టికెట్లను భక్తులకు అందిస్తోంది. ఈ వర్చువల్ సేవ, సంబంధిత దర్శన టికెట్లను నేటి నుంచి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతుంది. డిసెంబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల ఆన్ లైన్ వెబ్ సైట్ ద్వారా భక్తులు పొందవచ్చు..
ఇప్పటికే డిసెంబర్ నెలకు సంబంధించి ప్రత్యేక దర్శనం300 రూపాయల దర్శన కోటాను శుక్రవారం ఆన్లైన్ ద్వారా విడుదల చేయగా.. కేవలం కోటా విడుదలైన 80 నిమిషాల్లోనే 5 లక్షల 6 వేల,6 వందల టికెట్లను భక్తులు బుక్ చేసుకున్నారు. అయితే డిసెంబర్ నెల టికెట్ల కోటాను అక్టోబర్ లోనే విడుదల చేయాల్సి ఉండగా.. వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని డిసెంబర్ నెల నుంచి మార్పు చేయాలని టీటీడీ నిర్ణయానికి రావడంతో స్లాట్ల సర్దుబాటులో భాగంగా జాప్యం జరిగింది. (Twitter)
ఇవి బుక్ చేయాలంటే కాస్త ముందస్తు ప్రిపరేషన్ ఉంటే చాలు.. ఈ టికెట్లు పొందడానికి రైల్వేలో తత్కాల్ టిక్కెట్ బుక్ చేసుకున్నట్లుగానే ముందుగానే తిరుమల వెంకన్న ఆర్జిత సేవలను పొందొచ్చు. అదెలాగో చూద్దాం. టీటీడీ ఆన్ లైన్ టిక్కెట్లు కావాలంటే https://ttdsevaonline.com సైట్లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇందు కోసం సైట్లో సైన్ అప్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.
అక్కడ మెయిల్ ఐడీ, ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఎంచుకోవాలి అలాగే కన్ఫర్మేషన్ కోసం మొబైల్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. వెంటనే మన డిజిటల్ ఫొటో అప్ లోడ్ చేయాలి. ఐడీ కార్డలు వివరాలు ఇవ్వాలి. అంతా పూర్తయ్యాక మెయిల్ కు యాక్టివేషన్ లింకు వస్తుంది.
ఆ లింక్ ను క్లిక్ చేస్తే అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. అక్కడి నుంచి లాగిన్ పేజికి వెళ్తుంది. లాగిన్ కాగానే ఏఏ సేవలున్నాయో చూపిస్తూ డ్యాష్ బోర్డు ఓపెన్ అవుతుంది. అక్కడ మనకు కావాల్సిన సేవలను, మనకు కావాల్సిన తేదీల్లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. అందులో ఖాళీలు ఉంటే గ్రీన్ కలర్ చూపిస్తుంది.. ఎన్ని ఖాళీలున్నాయో చూపిస్తుంది.
అన్ని నిండిపోతే రెడ్ కలర్ చూపిస్తుంది. కోరుకున్న తేదీన కావాల్సిన సేవ ఉంటే అక్కడ చూపించిన టిక్కెట్ మొత్తం చెల్లిస్తే బుక్ అవుతుంది. చెల్లింపులు సాధారణ ఈకామర్స్ సైట్లలో, రైల్వే సైట్లో చెల్లింపులు ఉన్నట్లే ఉంటాయి. చెల్లింపు పూర్తయి మనకు సేవ బుక్ కాగానే కన్ఫర్మేషన్ మెసేజి వస్తుంది. అదనపు లడ్డూలు కావాలన్నా ఇదే సైట్లో బుక్ చేసుకోవచ్చు.