Tirumala Alert: ప్రత్యక్ష కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి అయినా దర్శించుకోవాలని ప్రతి భక్తుడి కోరిక. కానీ ప్రస్తుతం ఊహించని స్థాయిలో రద్దీ ఉండడంతో స్వామి వారి దర్శన భాగ్యం దక్కడం లేదు. సర్వదర్శనానికి అనుమతి ఇస్తున్నా.. ప్రత్యేక దర్శనం 300 రూపాయల టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతున్నా.. చాలా వారు స్వామిని దర్శించుకోలేకపోతున్నారు.
అందుకే అలాంటి వారికి అందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో.. తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. వారి కోటా కింద నవంబర్ నెల ఆన్లైన్ దర్శనం టికెట్లను అక్టోబర్ 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. శ్రీవారి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ పేర్కొంది.
సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు దర్శనం కోసం ఎలా బుక్ చేసుకోవాలి..?
ఎవైరనా కచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం అఫిషియల్ వెబ్ సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి. సీనియర్ సిటిజన్లు అయితే వారి వయస్సు 65 సంవత్సరాలకుపైగా ఉండాలి.. దానికి సంబంధించి ఐడీ ప్రూఫ్ దగ్గరే ఉంచుకోవాలి. ఉచితంగానే దర్శనం కల్పిస్తారు. అయితే
సీనియర్ సిటిజన్ వెంట ఒక వ్యక్తికి మాత్రమే అనుమతిస్తారు. అది కూడా ఎవరి సహాయం లేకుండా ఉండలేకపోతున్నారని అనిపిస్తేనా..?
మరోవైసు సూర్య గ్రహణం కారణంగా తిరుమల ఆలయాన్ని ఉదయం మూసివేశారు. మళ్లీ రాత్రి 8.30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. ఉదయం 7 నుండి 7.45 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. సాయంత్రం 5.11 నుండి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఉన్న కారణంగా ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉదయం 8.11 గంటలకు ఆలయం తలుపులు మూశారు.
వంటశాల శుద్ధి అనంతరం రాత్రి 8.30 గంటల నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమైంది. అన్నప్రసాదం కాంప్లెక్స్ మూసివేత వల్ల భక్తులు ఇబ్బంది పడకుండా ఉదయం 6 గంటలకు ఫుడ్ కౌంటర్లలో దాదాపు 10 వేల మందికి అల్పాహారం అందించారు. అదేవిధంగా, వైభవోత్సవ మండపం, సిఆర్వో వద్ద దాదాపు 30 వేల పులిహోర పొట్లాలు భక్తులకు పంపిణీ చేశారు.