Tirumala: తలయేరు గుండుకు ఆ పేరెలా వచ్చింది? దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసా?
Tirumala: తలయేరు గుండుకు ఆ పేరెలా వచ్చింది? దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసా?
Tirumala: తిరుపతి అలిపిరి కాలి నడకమార్గంలో ఉండే తలయేరు గుండుకు చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ గుండుకు మోకాళ్ళను ఆణించి ఆంజనేయస్వామి వారికి నమస్కరించి తిరుమలకు నడిచి వెళ్తే కాళ్ల నొప్పులు ఉండవని భక్తులు విశ్వశిస్తారు. ఇంతకీ ఈ తలయేరు గుండు వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా? Hemanth, Tirumala, News 18
తిరుపతి అలిపిరి కాలి నడకమార్గంలో ఉండే తలయేరు గుండుకు చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ గుండుకు మోకాళ్ళను ఆణించి ఆంజనేయస్వామి వారికి నమస్కరించి తిరుమలకు నడిచి వెళ్తే కాళ్ల నొప్పులు ఉండవని భక్తులు విశ్వశిస్తారు.
2/ 10
వందల ఏళ్ళుగా ఈ ఆచారం కొనసాగుతుంది. దానికి ఆనవాళ్లుగా తలఏరు గుండుపై ఎన్నో బొడిపులు ఉండడం భక్తులకు ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. ఇంతకీ ఈ తలయేరు గుండు వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా?
3/ 10
కోట్లాదిమంది భక్తుల ఆరాధ్య దైవమైన వైకుంఠనాథుడు దర్శనార్థం నిత్యం దేశ విదేశాల నుండి తిరుమల పుణ్యక్షేత్రంకు భక్తులు చేరుకుంటారు. ఎన్నో వ్యయప్రయాసులకు ఓర్చుకొని శ్రీనివాసుడి దివ్య మంగళ స్వరూపం కోసం భక్తులు గంటలు రోజుల తరబడి పరితపించిపోతుంటారు.
4/ 10
ఇలా ప్రతినిత్యం 80 వేల నుండి లక్ష మంది వరకు స్వామి వారి దర్శనం కోసం వస్తుంటే అందులో అధిక శాతం అలిపిరి నడక మార్గం శ్రీవారి మెట్ల మార్గం గుండా మెట్టు మెట్టుకు పసుపు కుంకుమలు రాస్తూ కర్పూరం వెలిగిస్తూ గోవింద నామ స్మరణలను చేస్తూ ఎంతో భక్తి భావంతో తిరుమల కొండను అధిరోహిస్తుంటారు.
5/ 10
భక్తులు ఎంతో కష్టంతో చంటి బిడ్డలు, వృద్ధులు సైతం అలవోకగా ఏడుకొండలను ఎక్కి స్వామి వారిని దర్శిస్తే చాలు తమ కష్టమంతా తీరుతుందని భక్తులు ఎంతగానో నమ్ముతుంటారు. అయితే అలిపిరి పాదాల మండపం దాటగానే 100 మీటర్ల తరువాత కుడివైపున కనిపించేది తలయేరు గుండు.
6/ 10
అదే ఆ గుండుపై తిరుమలకు మార్గం చూపుతున్నట్లు ముందు ఆంజనేయస్వామి కనిపించగా..ఆ గుండు చుట్టూ చిన్న చిన్న గుంతలు కనిపించడం ఒక వంతు ఆశ్చర్యానికి గురయ్యేంతగా ఉంటుంది.
7/ 10
ఈ తలయేరు గుండులు పూర్వం అలిపిరి మార్గంలో మెట్లు నిర్మించక మునుపు ఈ ప్రాంతంలో ఒక సెలయేరు..దానికి ప్రక్కనే ఒక గుండు కూడా ఉండేదని స్ధానికులు చెబుతారు.
8/ 10
అలిపిరి మెట్ల మార్గం నిర్మించే క్రమంలో తలయేరు గుండు కొట్టి ప్రక్కకు జరపడం ద్వారా తలయేరు మార్గంను మార్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే పూర్వం ఈ మార్గం గుండా తిరుమలకు వెళ్ళి శ్రీ కృష్ణదేవరాయలు సైతం ఈ తలయేరు గుండు వద్ద తల వాల్చి, కొంతసేపు సేద తీరి వెళ్ళారని పురాణాల ద్వారా తెలుస్తొంది.
9/ 10
ఇలా ఈ గుండు వద్ద మోకాళ్ళు ఆణించి, తలవాల్చి ఆంజనేయస్వామి వారిని ప్రార్ధిస్తే కాళ్ళనొప్పులు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే నేటికి ఇక్కడ భక్తులు మోకాళ్ళు ఆణించి, తలవాల్చి ఆంజనేయుడిని నమస్కరించి తిరుమలకు ప్రయాణం సాగిస్తుంటారు.
10/ 10
ఇక్కడ భక్తులు తలవాల్చి సేద తీరేవారు కనుక ఈ గుండుకు తలయేరు గుండుగా వాడుక పదం వచ్చిందని చెబుతారు.