ఎన్నో అరుదైన పక్షి, వృక్ష, జంతు జాతులు శేషాచలం అటవీ ప్రాంతంలో సంచరిస్తూ.. వాటికి ఆవాసంగా శేషాచలంను ఎంచుకుంటున్నాయి. దేశంలోనే అరుదైన పక్షుల జాతులు శేషాచలంకు వలస వచ్చి... ఇక్కడే ఉంటున్నాయి అంటే అందరికి ఆశ్చర్యానికి కలుగజేస్తుంది. వివిధ వర్ణాల ఈకలు., పొడవైన తోకలు., చిన్న పాటి పరిమాణంలో ఉండే పక్షులు ఏడుకొండల్లో కనువిందు చేస్తున్నాయి.
శేషాచలంకు వలస వచ్చే అరుదైన జాతి పక్షులను తన కెమెరాలో బంధించాడు ఓ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాపర్. 215 రకాల పక్షి జాతుల్లో దాదాపు 180కి పైగా జాతులను గుర్తించి వైల్డ్ లైఫ్ కి చిత్ర రూపంలో ప్రాణం పోస్తున్నారు... తిరుపతి బర్డ్ మ్యాన్ కార్తీక్. 2009వ సంవత్సరం నుంచి వివిధ జాతుల పక్షులపై పరిశోధన చేస్తూ.. ఆ అరుదైన పక్షులని బావితరాలకు ఫోటో రూపంలో అందించే ప్రయత్నం చేస్తున్నారు.
పక్షులపై ఉన్న ఆసక్తితో తో ఆర్నిథాలజి కోర్స్ చేశాననని.., పక్షుల బిహేవియర్ పై స్టడీ చేసినట్లు కార్తీక్ చెప్పారు. కొన్ని సొసైటీ ద్వారా మరిన్ని విషయాలు నేర్చుకున్నానని.., ఇప్పుడు మనం చూస్తున్న పక్షులు రేపటి కాలానికి ఉండకపోవచ్చని.., భావితరాలకు వాటి చిత్రాలు అందించాలనే వైల్డ్ ఫొటోగ్రాఫ్ లో ఎంటర్ అయినట్లు కార్తీక్ వివరించారు.
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నాకు చాల సపోర్ట్ చేసిందని..., ప్రస్తుతం అటవీ శాఖకు కూడా ప్రాజెక్టులు చేస్తున్నట్లు కార్తీక్ చెప్పారు. ఒత్తిడికి లోనైయ్యే వారు ఒక్కసారి అడవిలోకి వచ్చి పక్షులను చూడటం ద్వారా వారి ఒత్తిడి తగ్గే అవకాశం ఉందన్నారు. తన మిత్రులను తీసుకెళ్లి వారికీ ఆహ్లాదకరమైన వాతావరణం అందించడం నా అదృష్టంగా భావిస్తున్నానని బర్డ్స్ మ్యాన్ కార్తీక్ చెప్పారు.