Big Shock: ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ఆర్టీసీ బాదుడు మొదలైంది.డీజిల్ సెస్ పేరుతో నేటి నుంచి ఏపీలో ఆర్టీసీ బస్సుల ఛార్జీలు భారీగా పెరిగాయి. ఇప్పటినుంచి డీజిల్ సెస్‌ను దూరాన్ని బట్టి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీజిల్ సెస్ పెంపుతో ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి. అయితే ఈ ప్రభావం తిరుమల కొండకు వెళ్లే సామాన్య భక్తుల పై మరింత పడనుంది.
కనీస ఛార్జీల పెంపుతో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కనీస ఛార్జీ 20 రూపాయలుగా, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో కనీస ఛార్జీ 25 రూపాయలుగా, సూపర్ లగ్జరీ బస్సుల్లో కనీస ఛార్జీ 40 రూపాయలుగా, ఇంద్ర బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ 50 రూపాయలుగా, గరుడ బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ 50 రూపాయలుగా, మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ 50 రూపాయలుగా, అమరావతి ఎసీ బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ 50 రూపాయలుగా, వెన్నెల స్లీపర్ బస్సుల్లోఇకపై కనీస ఛార్జీ 80 రూపాయలుగా ఉండనున్నాయి.
డీజిల్ సెస్ కారణంగా తెలంగాణలో ఇప్పటికే ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగాయి. ఫలితంగా హైదరాబాద్ కు వచ్చే ప్రయాణికులు ఇతర రాష్ట్రాకు చెందిన బస్పులను ఆశ్రయిస్తున్నారు. దీంతో తెలంగాణ ఆర్టీసీకి భారీ నష్టాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో్ ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు బస్సులు నడిపించే ఆర్టీసీ సంస్థలకు టీఎస్ఆర్టీసీ సర్క్యులర్ జారీ చేసింది.