TTD Alert: కలియుగ ప్రత్యక్ష దైవం.. తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వ సన్నిధిలో క్షణ కాలం గడిపినా ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది అన్నది భక్తుల నమ్మకం.. ఇక్కడ నిర్వహించే వివిధ సేవల్లో పాల్గొనేందకు భక్తులు ఆసక్తి చూపిస్తారు. అలాంటి భక్తులకు అలర్ట్.. నేడు అంగప్రదక్షిణ, ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు అంగప్రదక్షిణ టికెట్లను టీటీడీ వెబ్ సైట్ లో ఉంచనుంది. మధ్యాహ్నం నుంచి ఆర్జిత సేవలను అందుబాటులోకి తీసుకురానుంది టీటీడీ.
నేటి ఉదయం అంగప్రదక్షిణ టోకెన్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది టీటీడీ. నవంబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఉదయం 11 గంటలకు టీటీడీ వెబ్సైట్లో టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. తిరుమల శ్రీవారి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. మధ్యాహ ్నం నుంచి ఆర్జిత సేవా టికెట్లను కూడా అందుబాటులో ఉంచుతారు.
అయితే ఈ టోకెన్లను కేవలం అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. ఇతర వెబ్ సైట్లు లేద దళారులను ఎట్టిపరిస్థితుల్లో నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు. ఉదయం 11 గంటలకు వెబ్ సైట్ లో అంగ్ర ప్రదక్షిణ టికెట్లను విడుదల చేస్తామని.. దానిపై క్లిక్ చేసి.. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుందని..
అలా ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత.. మీ వివారాలు ఎంటర్ చేసి.. ఏ రోజు.. ఎంతమంది అంగ ప్రదక్షిణలు చేయాలి అనుకుంటున్నారో వివరాలు ఎంటర్ చేయాలని.. ఆధార్ కార్డు నెంబర్ తప్పక ఎంటర్ చేయాలని.. అన్ని డిటైల్స్ చెక్ చేసుకున్న తరువాత యూపీఐ పేమెంట్స్ లేదా డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా టోకెన్లు బుక్ చేసుకోవచ్చని టీటీడీ వెల్లడించింది.
మరోవైపు అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం ఏర్పడుతున్నాయి. ఈ రెండు రోజుల్లో శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈ నెల 25న సూర్య గ్రహణం కారణంగా ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల 30 నిముషాల వరకు ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు.
నవంబర్ 8న ఏర్పడనున్న చంద్ర గ్రహణం కారణంగా మరోమారు శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. నవంబర్ 8న ఉదయం 8 గంటల 30 నిముషాల నుంచి సాయంత్రం 7 గంటల 30 నిముషాల వరకు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. కాగా గ్రహణం రోజుల్లో వీఐపీ బ్రేక్, శ్రీవాణి, రూ.300 దర్శనాలు, ఆర్జిత సేవలు, అన్నీ రకాల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.