బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్.. సాహో తర్వాత నటిస్తున్న సినిమా రాధే శ్యామ్.
2/ 17
పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ యూరప్ లో జరుపురుకుంది.
3/ 17
ప్రస్తుతం రాధేశ్యామ్ కు సంబంధించిన చివరి దశ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
4/ 17
ఇదిలా ఉంటే రాధేశ్యామ్ లో కీలక సన్నివేశాలను కడప జిల్లాలోని గండికోటలో తెరకెక్కిస్తున్నారు.
5/ 17
బాహుబలిలో కట్టపగా ఆకట్టుకున్న సత్యరాజ్ మీద కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ సీన్ లో వేదపాఠశాలలో గురువుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీన్స్ లో అఘోరాలు కూడా కనిపిస్తుండటం ఆసక్తికి రేకెత్తిస్తోంది.
6/ 17
ఈ సీన్ లో వేదపాఠశాలలో గురువుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీన్స్ లో అఘోరాలు కూడా కనిపిస్తుండటం ఆసక్తికి రేకెత్తిస్తోంది.
7/ 17
గండికోటలో రాధేశ్యామ్ షూటింగ్ జరుగుతుందన్న సమాచారంతో ప్రభాస్ ఫ్యాన్స్ అక్కడికి భారీగా చేరుకుంటున్నారు.
8/ 17
దర్శకుడు రాధాకృష్ణ, ఇతర సిబ్బందితో సెల్ఫీలు తీసుకుని సంబరపడుతున్నారు.
9/ 17
ప్రస్తుతం రాధేశ్యామ్ మేకింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
10/ 17
గోపీచంద్ తో జిల్ సినిమాను రూపొందించిన రాధాకృష్ణ రాధేశ్యామ్ ను డైరెక్ట్ చేస్తుండగా... ప్రభాస్ సరసన పూజాహెగ్దే నటిస్తోంది.
11/ 17
ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఈ మూవీని వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
12/ 17
రాధేశ్యామ్ షూటింగ్ దాదాపు ముగియడంతో ప్రస్తుతం ప్రభాస్.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్, ఓమ్ రౌత్ ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నాడు.
13/ 17
అలాగే నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా ప్రాజెక్ట్ కే లో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోనే నటిస్తుండగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.