ఈ సందర్భంగా సీఎం జగన్ శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రి, స్మైల్ ట్రీ కాక్లియర్ ఇంప్లాంట్స్ దృశ్య మాలికను ప్రదర్శించారు. అనంతరం వైద్యులు, గుండె ఆపరేషన్లు చేయించుకున్నచిన్న పిల్లల తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. తరువాత ఎస్వీబిసి ఆన్లైన్ రేడియో లోగోను ఆయన ఆవిష్కరించారు.
అంతేగాక అత్యంత ఖరీదైన బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ మరియు ఇతర అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు కూడా ఉచితంగా చేస్తారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇలాంటి ఆసుపత్రి దేశంలోనే మొదటిది కాబోతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్ అంబులెన్స్ సౌకర్యం కలిగి ఉండటం కూడా ఈ ఆస్పత్రి మరో ప్రత్యేకత అని టీటీడీ తెలిపింది.