చిత్తూరు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 6
జిల్లాలోని 20 ప్రాజెక్టుల పరిధిలో 484 పోస్టులు భర్తీ చేయనుండగా, వీటిలో 110 అంగన్వాడీ కార్యకర్తలు, 65 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 309 మంది సహాయకులు(ఆయాలు) నియామకాలు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ ఆమోదం తెలిపారు. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 6
పోస్టులు భర్తీ చేయనున్న సీడీపీఓ కార్యాలయాల్లో అంగన్వాడీ కేంద్రాల వారీగా ఖాళీలు, రోస్టర్ వివరాలు అందుబాటులో ఉంచనున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 6
గ్రామ, వార్డు పరిధిలో ఉన్న స్థానిక వివాహితులు, పదో తరగతి ఉత్తీర్ణులైన వారు, 2021 జులై 1వ తేదీకి 21 నుంచి 35 సంవత్సరాలలోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 6
రోస్టర్ను అనుసరించి సంబంధిత సీడీపీఓ కార్యాలయంలో ఈనెల 26వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి సెప్టెంబరు 9వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 6
పూర్తి నోటిఫికేషన్ వివరాలు https:chittoor.ap.gov.in వెబ్సైట్లో ఉంచనున్నట్లు తెలిపారు. (ప్రతీకాత్మకచిత్రం)