GT Hemanth Kumar, News18, Tirupati. Minster Roja: వైసీపీ ఫైర్ బ్రాండ్.. పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల, క్రీడా శాఖ మంత్రి రోజా కు ఆధ్యాత్మిక భావన ఎక్కువే.. సమయం దొరికితే చాలా ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.. ఇక పుణ్యక్షేత్రాలల్లో అయితే ప్రత్యేకంగా పూజలు చేస్తుననారు. మొక్కులు మొక్కుకుంటారు. ఆమె పూజలు ఫలించే మంత్రి అయ్యారు అని ఆమె అభిమానులే అంటుంటారు.
తాజాగా రోజా పుష్ప కావడిలో మొక్కులు చెల్లించుకున్నారు. తమిళనాడులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుత్తణిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని
కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకుని పుష్ప కావడిలో తన మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి, రెవిన్యూ డివిజనల్ అధికారి తదితరులు ఆర్.కె.రోజా సెల్వమణి కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికారు.
సాధారణంగా సుబ్రహ్మణ్యస్వామిని విజయాలకు అధిపతిగా భావిస్తారు. ఆదిదంపతులు పార్వతీ పరమేశ్వరుల రెండవ కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి అన్న వినాయకుడు విఘ్నాధిపతి అయితే కుమారస్వామి విజయాధిపతిగా చెబుతారు. అందుకే సుబ్రహ్మణ్య స్వామిని సకల దేవతా స్వరూపునిగా, జ్ఞాన స్వరూపుడిగా కొలుస్తారు. ఆయన్ను స్మరించుకుంటే ఏ పనిలోనైనా విజయం సిద్ధిస్తుంది అంటారు.
సుబ్రహ్మణ్య స్వామి కారణ జన్ముడు. లోకకంటకుడైన తారకాసురుని సంహరించడానికి అవతరించాడు. తారకాసురుని చేత పీడించబడిన దేవతలను, సాధు, సజ్జనులను కాపాడి విముక్తి కలిగించాడు. పదవీ భ్రష్టున్ని చేసిన ఇంద్రుణ్ణి తిరిగి సింహాసనాధిష్టుణ్ణి చేశాడు. అందుకే రాజకీయ నేతలు సైతం తాము మంచి పదవుల్లో ఉండాలని కోరకుంటూ సుబ్రహ్మణ్యస్వామికి మొక్కులు మొక్కుతారు.