అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైయున్న తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏపి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా సాంప్రదాయ వస్ర్రాలతో తిరునామం ధరించిన జగన్మోహన్ రెడ్డి శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్దకు చేరుకున్నారు.
అనంతరం సాంప్రదాయ బద్దంగా శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు పరివట్టం కట్టారు.. అక్కడి నుంచి పట్టువస్త్రాలను తలపై ఉంచుకుని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామి వారికి వస్త్రాలు సమర్పించారు.. అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.