Jagananna Vidya Deevena: ఆంధ్రప్రదేశ్ మోహన్ రెడ్డి సంక్షేమంపై పూర్తి ఫోకస్ చేస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. ఉన్న పథకాలకు సమయానికి డబ్బులు అందిస్తున్నారు. కొత్త పథకాల రూపకల్పన చేస్తున్నారు. పాత పథకాలకు చెప్పిన షెడ్యూల్ ప్రకారం విడతల వారీగా నగదు జమ చేస్తున్నారు. తాజాగా పర్యటనలో ఉన్న సీఎం జగన్ విద్యార్థుల తల్లుల ఖాతాలోకి నగదు జమ చేశారు.
ఉన్నత విద్యను అభ్యశిస్తున్న వారికి పూర్తి ఫీజు రియింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జగనన్న విద్యాదీవెన పథకం కింద 2022 జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి దాదాపు 10.85 లక్షల మంది విద్యార్ధులకు రూ. 709 కోట్లను సీఎం వైఎస్ జగన్ తిరుపతిలో బటన్ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు.
అంతేకాదు గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు 1,778 కోట్ల రూపాయలతో సహా ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల క్రింద ప్రభుత్వం రూ.10,994 కోట్ల సాయం అందించింది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు లిమిట్స్ లేవని సీఎం స్పష్టం చేశారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకం కింద లబ్ధిచేకూరనుంది.
అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ, జగనన్న విద్యాదీవెన, ఆంధ్రప్రదేశ్ లో డిగ్రీ కాలేజీలు, ఆంధ్రప్రదేశ్ న్యూస్, ఏపీ న్యూస్, తెలుగు న్యూస్, విద్య, ఉన్నత విద్య, అప్ డేట్స్," width="1200" height="800" /> జగనన్న విద్యా దీవెన కింద ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా జమ చేస్తోంది. ఇప్పుడు 2022 జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి నిధులను సీఎం జగన్ నేరుగా విడుదల చేశారు.
ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా ఐటీఐ విద్యార్ధులకు 10 వేలు ప్రతి ఏటా రెండు వాయిదాల్లో.. పాలిటెక్నిక్ విద్యార్ధులకు 15 వేల రూపాయలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు నేర్చుకునే వారికి 20 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం.
దీనికి సంబంధించిన నగదును సీఎం జగన్ మోహన్ రెడ్డి.. తిరుమలలో వర్చువల్ గా బటన్ నొక్కి విడుదల చేశారు. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి, వారి తల్లుల ఖాతాల్లో ఈ నగదు జమ కానుంది. ఒకవేళ అన్ని అర్హతలు ఉండి.. ఎవరికైనా నగదు జమ కాకపోతే.. దగ్గర్లో సచివాలయానికి వెళ్లి.. అన్ని చెక్ చేయించి.. ఫిర్యాదు చేస్తే.. తక్షణం నగదు జమ అవుతుందని అధికారులు భరోసా ఇస్తున్నారు.
గత ప్రభుత్వంలో ఎక్కడైనా విద్యా దీవెన లాంటి పథకం ఉందా..? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరొకర ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చి చేతులుదులుపుకున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. నాడు నేడు కార్యక్రమం చంద్రబాబు హయాంలో జరిగిందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం పాఠశాలలను మూపసివేయాలనే ఆలోచనతో చంద్రబాబు ఉండేవారని జగన్ ఆరోపించారు.