తొమ్మిది రోజుల వేడకలు ఇలా..?
సెప్టెంబర్ 26న రాత్రి 7 నుండి 8 గంటల మధ్య అంకురార్పణ. ఈ వేడుకతో బ్రహ్మోత్సవాలకు తెర లేచినట్టే.. ఇక సెప్టెంబరు 27న మొదటి రోజు సాయంత్రం 5.15 నుండి 6.15 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 నుండి 11 గంటల వరకు పెద్ద శేష వాహనం ఉంటుంది. రెండేళ్ల తరువాత తొలిసారి భక్తుల సమక్షంలో ఈ వేడుకలను నిర్వహించనున్నారు.
అక్టోబర్ 4వ తేదీ.. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు ఉదయం 7 గంటలకు రథోత్సవం (చెక్క రథం)తో స్వామి వారిని ఊరేగిస్తారు. అదే రోజు రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వ వాహనం స్వామి మాడ వీధుల్లో విహరిస్తూ.. భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇక బ్రహ్మోత్సవాతు చివరి రోజుకు వస్తున్న కొద్దీ భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
మాడ వీధుల్లో కేవలం 1.9 లక్షలు మంది భక్తులు మాత్రమే ఉత్సవాలను వీక్షించే అవకాశం ఉందని, రెండేళ్లు అనంతరం ఉత్సవాలను మాడ వీధుల్లో నిర్వహిస్తా ఉండడంతో ఈ సారి అంతకంటే భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఉత్సవాలు తిలకించేందుకు వచ్చే భక్తులు కచ్చితంగా పోలీసుల సూచనలను పాటించాలన్నారు.తీవ్రవాదుల కదలికల ఉన్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.