Tirupati: మొన్న విజయనగరం, నిన్న హిందూపురం, నేడు తిరుపతి.. అన్నీ ప్రభుత్వ హత్యలే... అంటున్న విపక్షాలు

సాధారణంగా విషాదం నింపే ప్రమాదం ఒకటి జరిగింది అంటే.. ప్రభుత్వం, అధికారులు అలర్ట్ అవ్వాలి. అలాంటి ఘటన జరగకుండా జాగ్రత్త పడాలి. కానీ ఏపీలో పరిస్థితి భిన్నం అంటున్నాయి విపక్షాలు. హిందుపురంలో ఘటన జరిగిన తరువాత మళ్లీ తిరుపతిలోనూ ఆక్సిజన్ అందక కరోనా రోగులు మరణించడం దారుణమంటున్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అంటూ విపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.