Samantha Akkineni: కరోనా వేళ సమంత పెద్దమనసు... శభాష్ అనిపించుకుంటున్న అక్కినేని కోడలు..
Samantha Akkineni: కరోనా వేళ సమంత పెద్దమనసు... శభాష్ అనిపించుకుంటున్న అక్కినేని కోడలు..
కరోనా మహమ్మారి (Corona Pandemic) విలయం సృష్టిస్తున్నవేళ వైరస్ సోకి మందులు కొనుక్కోలేని పేదలకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. ఈ జాబితాలో అక్కినేని కోడలు సమంత (Samantha Akkineni) చేరారు.
కొంతమంది సినీనటులు నటనలోనే కాదు సామాజిక సేవలోనూ ముందుంటారు. కోవిడ్ వేళ కొందరు సెలబ్రెటీలు కరోనా బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. (Samantha Instagram)
2/ 7
ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కొవిడ్ బాధితులకు మందులు, ఇతర వస్తువులు అందిస్త అండగా నిలుస్తున్నారు. Photo: Samantha Instagram
3/ 7
తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. (Samantha Akkineni/Instagram)
4/ 7
కరోనా పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న పేదల కోసం సమంత నేతృత్వంలోని ప్రత్యూష ఫౌండేషన్ మందులు, పల్స్ ఆక్సీమీటర్లు అందజేస్తోంది. (Instagram/Photo)
5/ 7
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తి పట్టణంలోని కొవడ్ బాధితులకు స్ఫూర్తి ఫౌండేషన్, తిరుపతి సీడ్స్ సహకారంతో ప్రత్యూష పౌండేషన్, స్థానిక యువతరం సేవా సమితి ఆధ్వర్యంలో మందులు పంపిణీ చేశారు.
6/ 7
మందులు కొనలేని స్థితిలో ఉన్న పేద కొవిడ్ బాధితులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాజిటివ్ రిపోర్ట్ మరియు మీ అడ్రస్ లేదా లొకేషన్ ను యువతరం సేవాసమితి హెల్ప్ లైన్ నెంబర్ 8885395305 ఫోన్ కాల్ లేదా వాట్సాప్ ద్వారా పంపితే వెంటనే మెడికల్ కిట్ తో పాటు పల్స్ ఆక్సీమీటర్ అందజేస్తారు.
7/ 7
కరోనా వేళ సాయం అందిస్తున్న సమంతతో పాటు యువతరం సేవా ఫౌండేషన్ ప్రతినిథులను స్థానికులు అభినందిస్తున్నారు.