చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్లి వస్తుండగా ఓ ట్రాక్టర్ బోల్తా పడింది.
లక్ష్మయ్య ఊరు దగ్గర్లో ట్రాక్టర్ బోల్తా పడటంతో ముగ్గురు మహిళలు, ఒక డ్రైవర్, ఇద్దరు పిల్లలు చనిపోయారు.
గాయపడిన దాదాపు 20 మందిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్, ఎస్పీ రీశాంత్ రెడ్డి స్పందించారు.
గాయపడిన వారికి తక్షణ వైద్యం అందించామనీ, తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే ఉన్నత ఆసుపత్రులకు తరలించే ఏర్పాటు చేశామని తెలిపారు.
మొత్తంగా రాత్రివేళ జరిగిన ఈ రోడ్డు ప్రమాదం మృతుల కుటుంబాల్ని విషాదంలో ముంచేసింది.
పెళ్లికి వెళ్లి సంతోషంగా వస్తున్న వారి కుటుంబాల్లో ఇదో విషాద ఘటనగా మారింది. స్థానికులను కూడా ఇది కలచివేసింది.
...