Tirumala: వైకుంఠ ద్వార దర్శనాలతో శ్రీవారి హుండీకి ఎంత ఆదాయం వచ్చిందంటే..
Tirumala: వైకుంఠ ద్వార దర్శనాలతో శ్రీవారి హుండీకి ఎంత ఆదాయం వచ్చిందంటే..
Tirumala: తిరుమలలో 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు జరిగాయి. లక్షలాది మంది భక్తులు వైకుంఠ ద్వారం గుండా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. మరి ఈ 10 రోజులు ఎంత మంది భక్తులు వచ్చారు? టీడీపీకి ఎంత ఆదాయం వచ్చింది? ఎన్ని లడ్డూలను విక్రయిచారో తెలుసా..?
తిరుమలలో 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు జరిగాయి. లక్షలాది మంది భక్తులు వైకుంఠ ద్వారం గుండా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. మరి ఈ 10 రోజులు ఎంత మంది భక్తులు వచ్చారు? టీడీపీకి ఎంత ఆదాయం వచ్చింది? ఎన్ని లడ్డూలను విక్రయిచారో తెలుసా..?
2/ 9
ఆదివారం అర్ధరాత్రి తిరుమల వైకుంఠ ద్వారాలు మూసి వేశామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి పేర్కొన్నారు. 10 రోజులలో శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారం ద్వారా 4లక్షల 25వేల 596 మంది భక్తులు దర్శనం చేసుకున్నారని తెలిపారు.
3/ 9
డిసెంబర్ 25న ముక్కోటి ఏకాదశి నుంచి జనవరి 3 వరకూ భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం అనుమతించారు. వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో స్వామి వారికి హుండీ ద్వారా రూ. 29.06 కోట్ల ఆదాయం లభించిందని జవహర్ రెడ్డి అన్నారు.
4/ 9
స్వామి వారి ఆలయంలోని పుష్ప అలంకరణ అద్భుతంగా ఉందని భక్తులు సంతోషం వ్యక్తం చేసారని తెలిపారు. పది రోజుల పాటు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగ కుండా ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు.
5/ 9
వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చిన భక్తుల్లో 4,52,000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్కింగ్ చేసుకునే సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా సాంకేతిక లోపాలను తోలగించామని ఈవో జవహర్ రెడ్డి పేర్కొన్నారు.
6/ 9
అలిపిరి నడకమార్గంలో 21300 మంది భక్తులు...శ్రీవారి మెట్టు నడకమార్గంలో 9789 మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 1.83 లక్షల మంది భక్తులు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లపై స్వామి వారిని దర్శించుకున్నారు.
7/ 9
ఇక సర్వదర్శనం టోకెన్లపై 90852 మంది భక్తులు... శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10725 మంది భక్తులు.... దాతల రూపంలో 4800 మంది భక్తులు... వర్చువల్ సేవా టిక్కెట్లు కలిగిన 38229 మంది భక్తులు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు.
8/ 9
ఈ 10 రోజుల్లో 20.05 లక్షల లడ్డులు విక్రయించామని, 93238 వాహనాలు తిరుమలకు చేరుకున్నాయని 50894 గదులు భక్తులకు కేటాయించగా ... 2.27 కోట్లు ఆదాయం లభించిందని అధికారులు పేర్కొన్నారు.
9/ 9
మొత్తం 90290 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని 30టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయంలో మూడు సార్లు పుష్పాలంకరణ చేశామని అన్నారు. రేపటి నుండి పాపవినాశనంతో పాటు శీలాతోరణంకు భక్తులను అనుమతిస్తామని ధర్మారెడ్డి పేర్కొన్నారు.