Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. 10 రోజుల పాటు వారికి మాత్రమే ఎంట్రీ
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. 10 రోజుల పాటు వారికి మాత్రమే ఎంట్రీ
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి మరో మారు విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో స్థానికులకు మాత్రమే 24వ తేదీన రోజుకు 10 వేల చొప్పున 10 రోజులకు లక్ష సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి మరో మారు విజ్ఞప్తి చేశారు.
2/ 6
అదనపు ఈవో ధర్మారెడ్డి తో కలసి బుధవారం ఆయన వైకుంఠం క్యూ కంప్లెక్స్ 1, 2 ఏటీసీ సర్కిల్, సుపథం, రూ 300 టికెట్ ప్రవేశ మార్గాలను పరిశీలించారు.
3/ 6
10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం కోసం చేసిన ఏర్పాట్లను చూసి అధికారులకు సూచనలు చేశారు.
4/ 6
అనంతరం ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 25 నుంచి 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం కోసం రోజుకు 20 వేల చొప్పున 10 రోజులకు గాను రూ.300 టికెట్లు 2 లక్షలు ఆన్లైన్లో విడుదల చేశామన్నారు.
5/ 6
తిరుపతిలో స్థానికులకు మాత్రమే 24వ తేదీన రోజుకు 10 వేల చొప్పున 10 రోజులకు లక్ష సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు.
6/ 6
కోవిడ్ 19 పరిస్థితుల నేపథ్యంలో టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే అలిపిరి టోల్ గేట్, నడక మార్గాల్లో అనుమతిస్తామని ఈవో స్పష్టం చేశారు.