రేపు (శనివారం) ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టిక్కెట్లను అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేయనుంది టీటీడీ. కోవిడ్ ఉగ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఆఫ్ లైన్ టిక్కెట్ల విడుదలపై పునరాలోచిస్తోంది టీటీడీ. భక్తులు అధిక సంఖ్యలో తిరుపతికి చేరుకొని ఇబ్బందులకు గురి కాకూడదని.. ఆన్లైన్ లోనే పూర్తి స్థాయి సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనుంది. అయితే ఇవి ఫ్రీ టికెట్లు కావడంతో.. 300 రూపాయల కంటే అతి త్వరగా పూర్తి అయ్యే అవకాశం ఉంది.
ఆన్ లైన్ లో బుక్ చేసినప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్ సైట్ ద్వారా మాత్రమే ఈ టికెట్లను బుక్ చేసుకోవాలి.. టీటీడీ అధికారిక వెబ్ సైట్ ఇది మాత్రమే tirupatibalaji.ap.gov.in.ఇతర నకిలీ వెబ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది..
అలాగే ఒక ఫోన్ నెంబర్ పై కేవలం 6 టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అంతకన్నా ఎక్కువ కావాల్సిన వారు.. ఇద్దరు వ్యక్తులు టికెట్లు బుక్ చేయాల్సి ఉంటుంది. అలాగే కేవలం 12 ఏళ్లు దాటిన వారికి మాత్రమే ఆన్ లైన్ టికెట్లను జారీ చేస్తారు. ఈ విషయాలు తెలుసుకుని బుక్ చేసుకుంటే.. త్వరగా ప్రాసెస్ పూర్తి చేయొచ్చు.
కరోనా ఆంక్షలు కారణంగా టీటీడీ పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి టీటీడీ అనుమతిస్తుంది. శ్రీవారి దర్శనం కోసం లక్షలాదిగా వేచి చూస్తున్న భక్తులకు టీటీడీ నుంచి నిరాశ మాత్రం తప్పడం లేదు. ఓ వైపు ఓమిక్రాన్ ముప్పు ముంచుకొస్తుంటే మరోవైపు సాధారణ కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి మాసంలో కూడా దర్శనం కోటాను టీటీడీ పెంచలేదు.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని ఇప్పటికే సూచించింది. దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా దర్శనం చేసుకునే సమయంలొని 78 గంటల ముందు చేసుకున్న కోవిడ్ టెస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా అధికారులకు చూపించాలి. కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ను ఉన్నవారిని మాత్రమే అలిపిరి చెక్ పాయింట్ నుంచి తిరుమలకు అనుమతిస్తున్నారు.