TTD Alert: కరోనా కారణంగా 2020 మార్చిలో శ్రీవారి ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిలిపివేసింది. అయితే ప్రస్తుతం కరోనా (Corona virus) వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో భక్తుల కోరిక మేరకు మళ్లీ సేవలను పునరుద్ధరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 1నుంచి శ్రీవారి ఆలయంలోఆర్జిత సేవలు (Aarjitha Seva Tickets) తిరిగి ప్రారంభంకానున్నయి.
ఇందులో భాగాంగా ఏప్రిల్, మే, జూన్ మొత్తం 3 నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను నేడు ఆన్లైన్లో రిలీజ్ చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజ పాద దర్శనం తదితర ఆర్జిత సేవా టిక్కెట్లు ఎలక్ట్రానిక్ లాటరీ పద్ధతి ద్వారా భక్తులకు కేటాయిస్తారు. ఉదయం 10 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు రెండ్రోజుల పాటు ఆన్లైన్లో టికెట్లు విడుదల చేస్తారు.
భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఆయా సేవలకు భక్తులను అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లను ఆన్లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయిస్తారు.
ఏప్రిల్ 2వ తేదీన ఉగాది పురస్కరించుకుని కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఏప్రిల్ 10న శ్రీరామనవమి రోజున తోమాల, అర్చన, సహస్రదీపాలంకరణ సేవలు, ఏప్రిల్ 14 నుంచి 16 వరకూ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు, ఏప్రిల్ 15న నిజపాద దర్శనం సేవల్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
ఆర్జిత సేవా టికెట్ల కోసం భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఇక ఇక తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ లేదా రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి అని టీటీడీ తెలిపింది. భక్తుల ఆరోగ్యం, టీటీడీ ఉద్యగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని నిబంధనలకు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.