Tirumala Tirupati Devasthanam: కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఎదురు చూసే భక్తులకు మరో శుభవార్త.. ఇప్పటికే శుక్రవారం ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేస్తే.. 3 లక్షల 36 వేల టికెట్లు కేవలం 40 నిమిషాల్లోనే పూర్తయ్యాయి. ఆ టికెట్ల మిస్సై అయ్యాయి అని నిరాశ చెందే వారికి మరో శుభవార్త ఇవాళ సర్వ దర్శన టోకెట్లనను అందుబాలోకి తీసుకొస్తోంది.
సాధారణంగా లక్షల్లో టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచినా.. అవి కొన్ని నిమిషాల్లోనే ఫుల్ అయిపోతున్నాయి.. దీంతో చాలామంది భక్తులు నిరాశ చెందుతున్నారు.. సాంకేతిక సమస్యలు.. నెట్ అందుబాటులో లేకపోవడం.. ఎలా బుక్ చేసుకోవాలో తెలియకపోవడం లాంటి కారణాలతో ఇకపై ఆఫ్ లైన్ లోనే టికెట్లు విడుదల చేయాలని నిర్ణయించింది టీటీడీ.