ఇప్పటికే ఆర్జీత సేవ టికెట్ల విక్రయాలను సైతం టీటీడీ ప్రారంభించింది. ఏప్రిల్, మే, జూన్ మొత్తం 3 నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను నేడు ఆన్లైన్లో రిలీజ్ చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజ పాద దర్శనం తదితర ఆర్జిత సేవా టిక్కెట్లు ఎలక్ట్రానిక్ లాటరీ పద్ధతి ద్వారా భక్తులకు కేటాయించారు.
తాజాగా తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. అంగప్రదిక్షణానికి అనుమతించింది. దీనికి సంబంధించిన టోకెటన్లను ఏప్రిల్ 1వ తేదీన జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రకటించింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమలలో అంగప్రదక్షణ టోకెన్ల జారీని నిలిపివేసింది టీటీడీ. ప్రస్తుత కోవిడ్ 19 వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో.. అంగప్రదక్షణ టోకెన్లను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది టీటీడీ.
ఏప్రిల్ 2వ తేదీన ఉగాది పురస్కరించుకుని కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఏప్రిల్ 10న శ్రీరామనవమి రోజున తోమాల, అర్చన, సహస్రదీపాలంకరణ సేవలు, ఏప్రిల్ 14 నుంచి 16 వరకూ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు, ఏప్రిల్ 15న నిజపాద దర్శనం సేవల్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.