తిరుమలలో బుధవారం సాయంత్రం పౌర్ణమి గరుడసేవ జరిగింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనాన్ని అధిరోహించారు. కోవిడ్ - 19 నిబంధనల మేరకు గరుడ వాహన సేవను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్ స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.