శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (Turumala Tirupathi Devasthanam) శుభవార్త చెప్పింది. వెంకన్న (Sri Venkateswara Swamy) ఆశీర్వాదంతో వివాహం చేసుకోవాలనే పేద జంటలకు కల్యాణమస్తు కార్యక్రమం కింద పెళ్లిళ్లు జరపించనుంది.
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. వెంకన్న ఆశీర్వాదంతో వివాహం చేసుకోవాలనే పేద జంటలకు కల్యాణమస్తు కార్యక్రమం కింద పెళ్లిళ్లు జరపించనుంది.
2/ 11
దేశవ్యాప్తంగా ముఖ్యమైన పట్టణాల్లో కల్యాణమస్తు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ముహూర్తాలని ఖరారు చేసింది.
3/ 11
శ్రీవారి ఆలయ పండితులు భేటీ అయి కల్యాణమస్తు కార్యక్రమానికి సంబంధించిన ముహుర్తాలను నిర్ణయించారు. ఈ మేరకు లగ్నపత్రిక రాశారు.
4/ 11
శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మూడు దివ్యమైన ముహూర్తాలను ఖరారు చేసినట్లు టీటీడీ తెలిపింది.
5/ 11
మొదటి ముహూర్తం: మే 28వ తేదీన వైశాఖ బహుళ విదియ శుక్రవారం మూల నక్షత్రం సింహ లగ్నం మధ్యాహ్నం 12:34 నుంచి 12:40 నిముషముల మధ్య ఒక ముహూర్తం నిర్ణయించారు.
6/ 11
రెండవ ముహూర్తం: అక్టోబర్ 30వ తేదీ ఆశ్వయుజ బహుళ పక్ష తత్యాల దశమి శనివారం మఖ నక్షత్రం ధనుర్లగ్నం ఉదయం 11:04 నుంచి 11:08 గంటల మధ్య రెండవ ముహూర్తం పండితులు నిర్ణయించారు.
7/ 11
మూడవ ముహూర్తం: నవంబర్ 17వ తేదీన కార్తీక మాసం శుక్లపక్ష తత్యాల చతుర్దశి బుధవారం అశ్విని నక్షత్రం ధనర్లగ్నం ఉదయం 9:56 నుంచి 10:02 గంటల మధ్య మరో ముహూర్తాన్ని నిర్ణయించారు.
8/ 11
వివాహం జరిపించే సమయంలో పేదల ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారికి వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో వివాహం జరిపించేందుకు టీటీడీ కల్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
9/ 11
కల్యాణమస్తు కార్యక్రమంలో భాగంగా వివాహం చేసుకునే జంటలకు పట్టు వస్త్రాలు, మంగళసూత్రాలతో పాటు 40 మందికి అన్నప్రసాదం అందించనున్నారు.
10/ 11
పదేళ్ల క్రితం నిలిచిన కల్యాణమస్తు కార్యక్రమాన్ని టీటీడీ ఈ ఏడాది నుంచి పునఃప్రారంభిస్తోంది.
11/ 11
లగ్న పత్రికను శ్రీ వేంకటేశ్వర స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు