తిరుమల శ్రీవారికి భారీగా హుండీ ఆదాయం వస్తోంది. మంగళవారం స్వామివారి హుండీ ఆదాయం రూ.4 కోట్లను దాటింది.
1/ 6
గత కొన్ని రోజులుగా వడ్డీ కాసులవాడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం భారీగా పెరుగుతోంది. మంగళవారంనాడు రూ.4.04 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. ఇప్పటి వరకు ఒక రోజులో రూ.4 కోట్లకు పైబడిన హుండీ ఆదాయం కొన్నిసార్లు మాత్రమే వచ్చింది.
2/ 6
ఈ నెల 10 తేదీన రూ.2.90 కోట్లు, 11న రూ.3.03 కోట్లు, 12న రూ.2.50 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.
3/ 6
ఇప్పటి వరకు ఈ ఏడాది జులై 26న రూ.6.28 కోట్ల హుండీ ఆదాయం రావడమే రికార్డుగా ఉంటోంది.
4/ 6
అంతకు ముందు వరకు అత్యధికంగా శ్రీరామ నవమి రోజైన 2012 ఏప్రిల్ 1 తేదీన రూ.5.73 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.
5/ 6
2012 జనవరి 1న రూ.4.23 కోట్ల హుండీ ఆదాయం రావడం మూడో అత్యధికం.
6/ 6
మంగళవారంనాడు మొత్తం 60,907 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం స్వామివారి దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. స్వామివారి సర్వదర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది.