చరిత్రలోనే మొదటి సరిగా తిరుమల శ్రీవారి వర్చువల్ ఆర్జిత సేవను టీటీడీ ప్రారంభించనుంది.
కళ్యాణోత్సవ సేవ ఆన్లైన్ టిక్కెట్లను రేపటి నుంచి అందుబాటులో ఉంచనుంది టీటీడీ.
ఆగస్టు 7 నుంచి 31వ తేదీ వరకు టిక్కెట్లను tirupatibalaji.ap.gov.in, govindha ttd ఆండ్రాయిడ్ యాప్ లో అందుబాటులో ఉంచనుంది.
కళ్యాణోత్సవ సేవలో మొదటి సరిగా భక్తులు ఆన్లైన్ లో పాల్గొంటారు.
ప్రతినిత్యం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీవారి కళ్యాణోత్సవం ప్రారంభం కానుంది.
సేవ ప్రారంభంలో భక్తులతో సంకల్పం చేయించనున్నారు అర్చకులు.
ఆన్లైన్ సేవలో పాల్గొనే భక్తులకు లడ్డు ప్రసాదం, అక్షింతలు, పట్టువస్త్రాన్ని పోస్టల్ ద్వారా పంపనున్నారు.
...