Tirumala Garuda Seva | తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణ పౌర్ణమి గరుడసేవ
Tirumala Garuda Seva | తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణ పౌర్ణమి గరుడసేవ
ప్రతినెలా పౌర్ణమి రోజున స్వామివారికి గరుడ సేవను నిర్వహించడం పరిపాటిగా వస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం స్వామివారికి శ్రావణ పౌర్ణమి గరుడసేవను నిర్వహించారు.
T తిరుమలలో ఇవాళ (సోమవారం) సాయంత్రం శ్రావణ పౌర్ణమి గరుడసేవ జరిగింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో స్వామివారికి గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు గరుడసేవ నిర్వహించారు.
2/ 4
తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనాన్ని అధిరోహించి పూజలు అందుకున్నారు.
3/ 4
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా గరుడ వాహన సేవను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు మాత్రమే ఈ సేవలో పాల్గొన్నారు. భక్తులను ఈ సేవను తిలకించేందుకు అనుమతించలేదు.
4/ 4
శ్రావణి పౌర్ణమి గరుడసేవలో టీటీడీ అర్చకులు, అధికారులు చిన్నజీయర్‌స్వామి, సివిఎస్వో గోపినాధ్ జెట్టి, విజివో మనోహర్ తదితరులు పాల్గొన్నారు.