Tirumala: శ్రీవారి ఆలయంలో ‘అడవి సెట్’... వేడుకగా పార్వేట ఉత్సవం
Tirumala: శ్రీవారి ఆలయంలో ‘అడవి సెట్’... వేడుకగా పార్వేట ఉత్సవం
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజైన ఆదివారం శ్రీవారి ఆలయంలో విజయదశమి పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. సంక్రాంతి కనుమ పండుగ రోజు కూడా తిరుమలలో పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజైన ఆదివారం శ్రీవారి ఆలయంలో విజయదశమి పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. సంక్రాంతి కనుమ పండుగ రోజు కూడా తిరుమలలో పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు.
2/ 10
ఈ సందర్భంగా మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారిని వేంచేపు చేశారు.
ఈ ఉత్సవంలో భాగంగా టీటీడీ ఈవో జవహర్ రెడ్డికి ఆలయ మర్యాద ప్రకారం పరివట్టం కట్టారు.
5/ 10
కోవిడ్-19 నిబంధనల కారణంగా ఆలయంలోని కల్యాణోత్సవ మండపం ఆవరణంలో టీటీడీ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏడుకొండలతో పాటు శేషాచలాన్ని తలపించేలా రూపొందించిన నమూనా అడవిలో వివిధ రకాల చెట్లు, రాళ్లు ఏర్పాటు చేశారు.
6/ 10
అందులో వన్యమృగాల బొమ్మలను ఉంచారు. ఈ ప్రాంతంలో స్వామివారు వేటలో పాల్గొన్నారు. అనంతరం విమాన ప్రాకారంలో ఊరేగింపు చేపట్టి స్వామివారిని రంగనాయకుల మండపంలోకి వేంచేపు చేశారు.
7/ 10
పార్వేట ఉత్సవం అనంతరం ఆలయం వెలుపల ఈవో మీడియాతో మాట్లాడుతూ లోకకల్యాణం, కరోనా నివారణ కోసం శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించామని చెప్పారు.
8/ 10
కోవిడ్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా పార్వేట ఉత్సవాన్ని కూడా ఆలయంలో ఏకాంతంగా నిర్వహించామన్నారు.
9/ 10
బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన జీయర్స్వాములకు, అర్చకస్వాములకు, అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.