తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 24న దీపావళి ఆస్థానం, అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం కారణంగా ఈ మూడు రోజుల్లో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
అక్టోబర్ 24న దీపావళి ఆస్థానం కారణంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినందున అక్టోబర్ 23న సిఫార్సు లేఖలు స్వీకరించబోమని దేవస్థానం అధికారులు తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
అక్టోబరు 25న మంగళవారం సూర్యగ్రహణం రోజున ఉదయం 8 నుంచి రాత్రి 7.30 గంటల వరకు దాదాపు 12 గంటలపాటు శ్రీవారి ఆలయం తలుపులు మూసి ఉంచుతారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఈ కారణంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినందున అక్టోబర్ 24న సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ అధికారులు తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
నవంబరు 8న చంద్రగ్రహణం రోజున ఉదయం 8.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ కారణంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినందున నవంబరు 7న సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని టీటీడీ తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం రోజుల్లో శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కూడా రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులు తమ యాత్రను ప్లాన్ చేసుకోవాలని కోరారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొద్దిరోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతోంది.(ప్రతీకాత్మక చిత్రం)