PICS: హనుమంత వాహనంపై దేవదేవుడు..!

తిరుమల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరోరోజు మంగళవారం ఉదయం మలయప్పస్వామి రాముని అవతారంలో తన పరమ భక్తుడైన హనుమంత వాహనంపై విహరించారు.  హనుమంత వాహన సేవను చూసేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు పోటెత్తారు. దేవదేవుడి చూసి తరించారు.  మంగళవారం సాయంత్రం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిస్తారు.