తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజులో భాగంగా ఆదివారం ఉదయం మలయప్ప స్వామి ఐదు శిరస్సుల చిన శేషవాహనంపై స్వామి వారు ఊరేగారు. ఐతే కోవిడ్ కారణంగా ఆలయంలోనే ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.