తిరుమల బ్రహ్మోత్సవాలు: హంస వాహనంపై విహరించిన శ్రీవారు

తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు రాత్రి హంస వాహనంపై సరస్వతి రూపంలో మలయప్ప స్వామి దర్శనమిచ్చారు. భక్తుల గోవింద నామ స్మరణ మధ్య తిరుమాడ వీధుల్లో విహరించారు.