PICS: గజవాహనంపై గోవిందుని విహారం

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు మంగళవారం రాత్రి గజ వాహనంపై తిరువీధుల్లో శ్రీవారు ఊరేగారు. వేంకటేశ్వరుడి రాజసాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ గజ వాహనంపై స్వామి వారు నాలుగుమాడ వీధుల్లో ఊరేగి వాహనమండపం చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడి ఈ వో అనిల్ కుమార్ సింగాళ్ మరియు అధికారులు పాల్గొన్నారు.