తన పతి అయిన శ్రీనివాసుడి తరహాలోనే నిత్య, వార, పక్ష, మాస, వార్షిక ఉత్సవాలను జరిపించుకుంటూ నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా భాసిల్లుతోంది. ప్రతి ఏడాది అమ్మవారికి కార్తీక మాసంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 28వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.