విజయవాడ వందే భారత్ రైలు, సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్" width="1200" height="1337" /> ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి వైజాగ్‌కు, అలాగే వైజాగ్ నుంచి సికింద్రాబాద్‌కు ఈ ట్రైన్‌ను నడుపుతున్నారు. సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, , స్టేషన్లలో మాత్రమే ఇది ఆగుతుంది. గత వారం నిర్వహించిన ట్రయల్‌రన్‌లో 8.30 గంటల్లో విశాఖ నుంచి సికింద్రాబాద్ చేరుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ సర్వీస్ ప్రారంభించినప్పటి నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్ నుంచి మరో మూడు రైళ్లు : హైదరాబాద్- విశాఖపట్నం నగరాల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు డిమాండ్ ఉన్న క్రమంలో.. హైదరాబాద్ నుంచి మరో మూడు వందే భారత్‌లు నడిపేందుకు ఇండియన్ రైల్వేస్ ఆలోచిస్తున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. స్మార్ట్ సిటీలు అయిన బెంగుళూరు, పూణే నగరాలు ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతికి వీటిని త్వరలో నడపనున్నట్లు సమాచారం.(ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్‌లోని కాచిగూడ స్టేష్‌న్ నుంచి బెంగుళూరు, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పూణే, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి తిరుపతికి కొత్త సర్వీసులు నడుస్తాయి. ఈ క్రమంలో ఆయా రైల్వే లైన్ల పరిధిలో నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేసే పనిలో దక్షిణ మధ్య రైల్వే నిమగ్నమైంది. ఈ మార్గాల్లో గంటకు గరిష్ఠంగా 130 కిలోమీటర్ల వేగంతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడవనుంది.(ప్రతీకాత్మక చిత్రం)
ప్రధాన కోచ్ డిపోకు వినతులు : దీనికి సంబంధించి సికింద్రాబాద్, , విజయవాడ డివిజన్లలో కనీసం ఒక ప్రధాన కోచ్ డిపోను ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులకు సూచనలు అందాయి. వీటిని నిర్వహించేందుకు డిపోలను అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఆ తర్వాత సిబ్బందికి శిక్షణ ఇస్తారు. వీటితో పాటు ఇతర కార్యకలాపాల కోసం ఆయా డివిజన్ల పరిధిలో పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు సూచనలు చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
మూడేళ్లల్లో 400 వందే భారత్ రైళ్లు : గత ఏడాది వందే భారత్ ప్రాజెక్టును ప్రవేశపెట్టగా.. ప్రస్తుతానికి నాగ్‌పూర్- బిలాస్పూర్, ఢిల్లీ- వారణాసి, గాంధీనగర్- ముంబాయి, చెన్నై- మైసూర్, సికింద్రాబాద్- వైజాగ్‌తో సహా పలు మార్గాల్లో ఎనిమిది వరకు ఈ రైళ్లు నడుస్తున్నాయి. ఈ ఏడాది చివరకు 75, రాబోయే మూడు సంవత్సరాలలో 400 వందే భారత్ రైళ్లను పట్టాలు ఎక్కించాలని భారతీయ రైల్వే శాఖ యోచిస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్ కేంద్రంగా మారే అవకాశం : మార్కెట్, ఇతర అంశాల దృష్ట్యా చూస్తే 400 కొత్త తరం వందేభారత్ రైళ్లకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉందని రైల్వే సీనియర్ ఉన్నతాధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా చెన్నైలోని పెరంబూర్‌లో ఉన్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఈ రైళ్లకు తయారు చేస్తోంది.(image: Indian Railways)