80 రోజుల తర్వాత శ్రీవారి దర్శనం.. పులకించిపోతున్న భక్తజనం..

ఒక్కటీ రెండూ రోజులు కాదు. ఏకంగా 80 రోజుల పాటు శ్రీవారి దర్శన భాగ్యం భక్తులకు కాలేదు. టీటీడీ చరిత్రలోనే ఇలా ఎన్నడూ జరగలేదు. ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి అలాంటి పరిస్థితిని తీసుకొచ్చింది. అయితే తాజాగా లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపులివ్వడంతో తిరిగి 80 రోజుల తర్వాత భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలిగింది. భక్తజనం లేక ఇన్నిరోజుల మూగబోయిన తిరుమల కొండపై శ్రీవారి నామ జపం మళ్లీ విన్పించడంతో సందడి నెలకొంది.