Corona Effect On Schools: ఆంధ్రప్రదేశ్ ను కరోనా వైరస్ భయపెడుతోంది. రోజు రోజు కూ కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఇప్పటికే రోజువారి నమోదయ్యే కేసుల సంఖ్య 13 వేల మార్కును దాటింది. కఠినంగా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నా..? షాపింగ్ మాల్స్, జనం గుమిగూడే ప్రాంతాల్లో ఆంక్షలు ఉన్నా కేసులు కంట్రోల్ కావడం లేదు. అయితే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో స్కూల్ విద్యార్థులు, ఉపాద్యాయులు ఉండడం కలవరపడేలా చేస్తోంది.
ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో స్కూళ్లపై పంజా విసురుతూనే ఉంది. సంక్రాంతి సెలవులు ముగిసిన వెంటనే స్కూల్స్ తెరవడం కూడా దీనికి ఒక కారణం కావొచ్చు.. సంక్రాంతి పండుగ కోసం విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో 70 శాతానికిపైగా మంది సొంత ఊళ్లకు వెళ్లి.. సొంతవారితో పండుగను చేసుకున్నారు. గ్రామాల్లో సంక్రాంతి సంబరాల్లో ఎవరూ కరోనా నిబంధనలు పాటించిన ఆనవాళ్లు లేవు.. అయితే అక్కడ నుంచి నేరుగా పండగ ముగియగానే స్కూళ్లు ఓపెన్ అవ్వడంతో ఈ కేసులు మరింత రెట్టింపు అయ్యే ప్రమాదం ఉంది.
ఈ నేపథ్యంలో విపక్షాలు, కొందరు విద్యార్థులు తల్లిదండ్రులు.. సంక్రాంతి సెలవులు పొడిగించనమి డిమాండ్ చేసినా.. ప్రభుత్వం కుదరదని చెప్పేసింది. విద్యార్థుల భవిష్యత్తు కోసమే స్కూల్స్ తెరవక తప్పని పరిస్థితి ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఎక్కడైనా భారీగా కరోనా కేసులు నమోదైతే ఆ స్కూల్స్ మూసివేస్తాం కానీ సెలవులు ఇచ్చే అవకాశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎవరి వాదన నిజం అన్నది పక్కన పెడితే ప్రస్తుతం స్కూల్స్ లో పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉంది. తాజాగా ప్రకాశం జిల్లాలోని పాఠశాలల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది.. గత 24 గంటల్లో ఓ స్కూల్లో 54 మంది ఉపాధ్యాయులు, 18 మంది విద్యార్థులు, నలుగురు నాన్ టీచింగ్ స్టాఫ్ కు కరోనా పొజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
గత ఐదు రోజుల్లో ప్రకాశం జిల్లాలోని స్కూళ్లలో 147 మందికి పైగా కరోనా సోకిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా ప్రకాశం జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో 772 కరోనా కేసులు నమోదు కాగా.. అందులో 10 శాతం కేసులు పాఠశాలల్లో నమోదు అయినవే కావడం కలవరపెట్టే అంశం.. రోజురోజుకూ పాఠశాలల్లో భారీగా నమోదవుతున్న కేసులతో అటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.
ప్రకాశం స్కూల్స్ లో కరోనా నమోదైన వారందరినీ ఐసోలేషన్ కు తరలించి తగిన చికిత్స అందిస్తున్నారు. రోజు రోజుకూ పాఠశాలల్లో భారీగా నమోదవుతున్న కేసులతో ఉపాద్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ కరోనా వైరస్ ఉధృతి తగ్గే వరకు పాఠశాలలకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
స్కూల్స్ కు సెలవు ఇవ్వడం విషయంపై ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు.. కరోనా కేసులు నమోదైన పాఠశాలలో శానిటైజర్ చేయించి స్కూల్స్ నడుపుతామని ఏపీ సర్కార్ తేల్చేసింది. అయితే ప్రభుత్వం స్కూల్స్ లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే కనిపిస్తోంది. కొందరి నిర్లక్ష్యం అందరినీ కష్టాల్లోకి నెడుతోంది..
తాజా పరిస్థితుల నేపథ్యంలో కరోనా ఉధృతి తగ్గేవరకు పాఠశాలలఖకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించాలని విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. కాగా, కోవిడ్ ఉధృతి కారణంగా చాలా రాష్ట్రాలు స్కూళ్లకు సెలవులు ఇచ్చాయి.. కానీ, ఏపీలో ఆ డిమాండ్ వినిపిస్తున్నా.. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా.. సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.. మరోవైపు, ఇప్పటికే స్కూళ్లు మూసివేసిన రాష్ట్రాలకు కూడా మళ్లీ తెరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.