Nara lokesh focus on mangalagiri: పోయిన చోటే వెతికే పనిలో పడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. మొన్నటి వరకు అతడు వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గం మారుస్తున్నారంటూ ప్రచారం జరిగింది. ఇప్పటికే ఆయన కొత్త నియోజకవర్గం చూసుకున్నారంటూ మీడియాలో కథనాలు కూడా వినిపించాయి. కానీ నారా లోకేష్ మాత్రం.. గత ఎన్నికల్లో ఓడిన చోటే.. భారీ మెజార్టీ నెగ్గి తన సత్తా చాటాలని భావిస్తున్నారు. అందుకు ఆయన ఫోకస్ అంతా అక్కడే ఉంది. ఇంతకీ నారా లోకేష్ మనసు మారడానికి కారణం ఏంటి..?
నారా లోకేష్ ఫోకస్ అంతా ఇప్పుడు మంగళగిరిపైనే ఉంది. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచే పోటీ చేసి.. తన సత్తా చాటాలి అనుకుంటున్నారు. అందుకే సమయం దొరికినప్పుడల్లా మంగళిగిరి వస్తున్నారు. స్థానికుల సమస్యలపై చర్చిస్తున్నారు. అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకుంటున్నారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు.
కుప్పం నియోజకవర్గం నారా ఫ్యామిలీ కంచుకోట.. అక్కడ ప్రచారానికి వెళ్లినా నారా చంద్రబాబు నాయుడిదే విజయం.. టీడీపీ అధినేతకు అడ్డగా చెప్పుకునే కుప్పంలో ఇటీవల ఫలితాలు.. లోకేష్ కు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశాయి అంటున్నారు.. అందుకే 2024 ఎన్నికలకు చాలా సమయమే ఉన్నా.. ఇప్పటి నుంచే తనకు అంటూ ఒక నియోజవర్గం ముందు నుంచి వెతికి పెట్టుకోకపోతే.. నష్టం తప్పదని నిర్ణయానికి వచ్చారు.. అయితే కొత్త నియోజకవర్గం వెతుక్కోడం కంటే.. గతంలో ఓడిన చోటే నిలబడి.. గెలిస్తే గౌరవంగా ఉంటుందని ఆయన భావిస్తున్నారు.
ఇప్పటికే కొంత ఓటు బేస్ మంగళగిరిలో సెట్ అయ్యింది. దానికి తోడు అమరావతి ఉద్యమం ఎఫెక్ట్.. ప్రభుత్వంపై వ్యతిరేకత.. స్థానిక ఎమ్మెల్యే ఆర్కే పై ఉన్న వ్యతిరేకత.. అన్ని కలిసి వస్తాయని.. ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటే,.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం పెద్ద కష్టం కాదని లోకేష్ డిసైడ్ అయ్యారు. అందుకే ఎప్పుడూ లేనిది ఆయన ఎక్కవగా మంగళిగిరిలోనే ఉన్నారు.
గతంలో ఎప్పుడు మంగళగిరి వెళ్లినా.. కేవలం కేడర్, పార్టీ నేతలతో మాట్లాడి వెళ్లే వారు.. కానీ ఇప్పుడు నేరుగా సామాన్యులను కలుస్తున్నారు. వారితో కాసేపు మాట్లాడుతున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలోనే లీడర్లు ఇలాంటి స్టంట్లు చేస్తుంటారు. కానీ నారా లోకేష్ మాత్రం ఎన్నికలు లేకున్నా.. అక్కడి సామన్య ప్రజలతో నిత్యం కలుస్తూనే ఉన్నారు. తాజాగా ఓ టీ కొట్టు దగ్గర టీ తాగిన ఆయన.. అమ్మా టీ చాలా బాగుంది.. స్టార్ హోటల్ లో కూడా ఈ టేస్ట్ రాదు అంటూ కొనియాడారు..