ఏపీలోని చాలా ప్రాంతాల్లో నిన్నటి వరకు చలి వణికించింది. రథసప్తమి తర్వాత మరింత తీవ్రత పెరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. చలి కాలం వెళ్లిపోయి.. వేసవి వచ్చేస్తోంది.
2/ 7
రాష్ట్రంలో వాతావరణం మళ్లీ మారనుంనుందని.. మెళ్లగా ఎండా కాలానికి ప్రారంభమవుతుందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. సాధారణంగా ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో అంతగా ఎండ ఉండదు. కానీ ఈ సారి మాత్రం వేసవి కాలం కాస్త ముందుగా మొదలవుతుందని పేర్కొన్నారు.
3/ 7
ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. మరో ఐదు రోజుల వ్యవధిలో ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీలు మేర పెరుగుతాయని పేర్కొన్నారు. అనంతపురం నుంచి నెల్లూరు మధ్యలో, నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా వేడి పెరుగుతుంది.
4/ 7
ఐతే ఇప్పుడే 40 డిగ్రీలు వరకు ఉష్ణోగ్రతలు నమోదు కాకపోవచ్చని.. 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగవచ్చని ఏపీ వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. విజయవాడ - గుంటూరు ప్రాంతం, అలాగే నంద్యాల జిల్లారాష్ట్రంలోని మిగిలిన భాగాలకంటే వేడిగా ఉంటుందట.
5/ 7
ఉదయం వేళ ఎండలు పెరిగినా.. రాత్రిళ్లు మాత్రం శీతల వాతావరణం కొనసాగుతుందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. మూడు నాలుగు రోజుల వరకు రాత్రిళ్లు చలికాలంలానే ఉంటుంది. ఆ తర్వాతి నుంచి క్రమంగా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి.
6/ 7
మారుతున్న వాతావరతణ పరిస్థితులతో.. ఏటా ఎండ తీవ్రత పెరుగుతూనే ఉంది. గతంతో పోల్చితే ఈసారి ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయట. ఈ వేసవికాలంలో సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే 0.5 నుంచి 1.5 డిగ్రీ సెల్సియస్ వరకూ ఎక్కువ వేడి అండే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ తెలిపింది.
7/ 7
ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా తీర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. ఉత్తర భారత దేశంలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగానే ఉండొచ్చని వెల్లడించింది.