తెలంగాణ వార్తలు, తెలంగాన వార్తలు, టీఎస్ వార్తలు, తెలుగు వార్తలు, తెలుగు బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ న్యూస్, rape In hyderabad, Hyderabad crime news, latest crime news in hyderabad, gang rape in hyderabad, hyderabad gang rape, hyderabad rape case,hyderabad rape, hyderabad gang rape case, hyderabad, hyderabad news,hyderabad rape and murder case, hyderabad gang rape, gang rape,hyderabad rape murder case,hyderabad veterinary doctor rape,hyderabad encounter,hyderabad female doctor rape murder case,hyderabad police,hyderabad rape and murder,hyderabad rape murder,hyderabad news today,hyderabad case,hyderabad latest news,wife gang raped in hyderabad - tv9,hyderabad girl rape, hyderabad rape,hyderabad gang rape case,hyd" width="1600" height="1600" /> Omicron Alert: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ను ఒమిక్రాన్ టెన్షన్ (Omicron) వెంటాడుతోంది. సౌతాఫ్రికా నుంచి (Srikakulam) వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ (Corona positive) గా తేలడంతో అంతటా ఆందోళన నెలకొంది. సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి కుటుంబంలో మరో ఇద్దరికి కరోనా సోకడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. అతడికి ఒమిక్రాన్ వచ్చిందా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కావాల్సిం ఉంది.
ఒమిక్రాన్ వేరింయట్ వేగంగా వ్యాప్తి నేపథ్యంలో, కోవిడ్ 19 వ్యాప్తిని నివారించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి కేంద్రం జారీ చేసిన పరిమితులు/మార్గదర్శకాల జాబితా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తులందరూ మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది.
ఏదైనా మార్కెట్ లేదా వాణిజ్య సంస్థలో కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించడంలో ఏదైనా ఉల్లంఘనలకు పాల్పడితే ఆప్రాంతం వెంటనే ఒకటి రెండు రోజుల్లో మూసివేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆప్రాంతంలో కోవిడ్-సముచిత నియమావళి, ప్రస్తుత జరిమానాలపై అవగాహన కల్పించడానికి మార్కెట్ అసోసియేషన్లను ప్రభుత్వం భాగస్వామ్యం చేసింది.
ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే.. వాట్సాప్ నంబర్ 8010968295లో ఫోటోగ్రాఫ్‌లను పోస్ట్ చేయడం ద్వారా కోవిడ్-రూల్స్‌ను అతిక్రమించిన వారిని అధికారుల దృష్టికి తీసుకెళ్ల వచ్చు. కోవిడ్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించే దుకాణాలపై చర్య తీసుకోవడానికి ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక అధికార యంత్రాంగాన్ని నియమించింది.
వివాహాలు, ఫంక్షలపైనా కఠిన ఆంక్షలు
వివాహాలు, మతపరమైన సమావేశాలు సామాజిక కార్యకలాపాలతో సహా అన్ని సమావేశాలను నిర్వహించుకోవడానికి గషరిష్టంగా 500 మందికి మాత్రమే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాల్లో పాల్గొనే వారందరూ మాస్క్ ధరించడం, తరచుగా హ్యాండ్ శానిటైజేషన్ చేయడం మరియు సామాజిక దూరాన్ని పాటించడంతోపాటు కోవిడ్ రూల్స్‌ను విధిగా నిబంధనలు పాటించాల్సిందే.
విజయవాడ వార్తలు, తెలుగు వార్తలు, ఏపీ వార్తులు, ఆంధ్రా వార్తలు, ఆంధ్ర ప్రదేశ్, వార్తలు, వార్తలు, Lockdown in Andhra Pradesh, AP Lockdown, ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్, ఏపీ లాక్ డౌన్, Covid Winners" width="1200" height="800" /> పొరపాటున ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే.. విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం సెక్షన్లు 51 నుండి 60 వరకు, IPCలోని సెక్షన్ 188 అలాగే వర్తించే ఇతర చట్టాల ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించిన అధికారాన్ని కలెక్టర్లు, జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు అమలు చేస్తారని ప్రభుత్వం పేర్కొంది. లాక్డౌన్ లాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ఇలాంటి నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందేనని ప్రభుత్వం భావిస్తోంది.