CM Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎంకు ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లే.. గత ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చాయి అంటే.. అది కేవలం జనగ్ క్రేజ్ వల్లే అని చెప్పక్కర్లేదు.. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా జనగ్ పై అదే స్థాయి అభిమానం చూస్తారు కొందరు కార్యకర్తలు.. ఆయన్న తమ దేవుడిగా పూజిస్తారు.. ఇక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండడంతో జగన్ ప్రేమించే అభిమానుల సంఖ్య పెరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు..
బంగారు పూల అభిషేకంతో పాటు.. ఆయన చిత్ర పటానికి పాలాభిషేకం కూడా చేశారు. ఇటీవల తమకు ప్రభుత్వం 23 శాతం ఫిట్మెంట్ ప్రకటించడమే కాకుండా రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచినందుకు ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్కు వారు ధన్యవాదాలు తెలియజేశారు. తాము ఊహించిన దానికంటే ఎక్కువగానే సీఎం జగన్ వరాలు కురిపించారంటూ ఇలా తమ అభిమానం చాటుకున్నారు.