Ap: విజేతలుగా తిరిగి రండి..శ్రీకాకుళం క్రీడాకారిణిలకు ఎస్పీ పిలుపు!
Ap: విజేతలుగా తిరిగి రండి..శ్రీకాకుళం క్రీడాకారిణిలకు ఎస్పీ పిలుపు!
Srikakulam: జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలలో సత్తా చాటి విజేతలుగా తిరిగి రావాలని శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంపికైన సీనియర్ క్రీడాకారులకి ఎస్పీ జి.ఆర్ రాధిక పిలుపునిచ్చారు. పోటీ ప్రపంచంలో చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని ఆమె ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు.
Srikakulam: జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలలో సత్తా చాటి విజేతలుగా తిరిగి రావాలని శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంపికైన సీనియర్ క్రీడాకారులకి ఎస్పీ జి.ఆర్ రాధిక పిలుపునిచ్చారు. పోటీ ప్రపంచంలో చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని ఆమె ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు.
2/ 9
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జాతీయ స్థాయి పోటీలకి బయలుదేరే ఇద్దరు ఫెన్సింగ్ క్రీడాకారిణిలకి ఆమె ఆల్ ది బెస్ట్ చెప్పారు. అలాగే కాకినాడలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి సీనియర్ ఫెన్సింగ్ పోటీలలో మెడల్స్ సాధించిన నలుగురు క్రీడాకారిణిలను ఆమె అభినందించారు.
3/ 9
వారిలో ఇద్దరు జాతీయ స్థాయి పోటీలకి ఎంపికైనట్లుగా తెలుసుకుని వారిని అభినందించారు. క్రీడాకారిణిలతో ముచ్చటించారు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
4/ 9
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాధిక మాట్లాడుతూ..శ్రీకాకుళం జిల్లా పేరు ప్రతిష్టలను ఇమడింపజేసేలా జాతీయ ఫెన్సింగ్ పోటీలలో రాణించాలన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభ పాఠవాలను నిరూపించుకుని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
5/ 9
ఈ సందర్భంగా ఫెన్సింగ్ కోచ్ వంశీని ఎస్పీ అభినందించారు. మహారాష్ట్రలోని పూణె వేదికగా ఈ నెల 24 నుంచి 28 వరకూ జరుగనున్న సీనియర్ విభాగం ఫెన్సింగ్ పోటీలకి శ్రీకాకుళం జిల్లా నుంచి క్రీడాకారిణిలు ఇద్దరు ఎంపికయ్యారు.
6/ 9
ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగనున్నాయి. వాటికి శ్రీకాకుళం జిల్లా నుంచి ఫోయిల్ విభాగంలో బడి పూజిత, ఇప్పీ విభాగంలో గురుగుబెల్లి అక్షయ ఎంపికయ్యారు. వారిని ఎస్పీ రాధిక అభినందించారు.
7/ 9
ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆద్వర్యంలో కాకినాడ వేదికగా ఈ నెల 10, 11 తేదీలలో జరిగిన సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పురుషులు, మహిళల విభాగంలో జరిగిన ఫెన్సింగ్ పోటీలలో నలుగురు క్రీడాకారిణిలు సత్తా చాటారు.
8/ 9
వారిలో ఫోయిల్ విభాగంలో బడి పూజిత, ఇప్పి విభాగంలో గురుగుబెల్లి అక్షయ, ఫోయిల్ విభాగంలో ఎం.బ్లెస్సీ, కె.అనిశ్రీలు పతకాలు సాధించారు. ఆ నలుగురుని ఎస్పీ రాధిక అభినందించారు.
9/ 9
క్రీడాకారులంతా జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు వైశ్యరాజు మోహన్, ఎం.సుధీర్ వర్మ తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తైక్వాండో శ్రీను, స్కూల్ గేమ్స్ సెక్రెటరీ బి.వి.రమణ తదితరులతో కలిసి జిల్లా ఎస్పీ రాధికను కలుసుకున్నారు.