జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మొబైల్స్ పోగొట్టుకున్న బాధితుల పోలీసు స్టేషన్లు కు వెళ్లే పనిలేకుండా జిల్లా ఐటి కోర్ టీమ్ రూపకల్పన చేసిన http://srikakulampolice.in/mobiletrackupload.html అధికార వెబ్సైట్ నందు పోగొట్టుకున్న ఫోన్ యొక్క సమాచారాన్ని బాధితులు రిజిస్ట్రేషన్ చేయడంతో జిల్లా సైబర్ సెల్ సిబ్బంది 150 ఫోన్లును గుర్తించారు.
మిగతా ఫోన్లు కూడా వీలైనంత త్వరగా రికవరీ చేసి బాధితులకు అందజేసేలా కృషి చేస్తామని ఎస్పీ అన్నారు. సరైన పత్రాలు లేకుండా ఎవరూ మొబైల్ ఫోన్స్ కొనవద్దని ప్రజలకు జిల్లా ఎస్పీ సూచించారు. అతి తక్కువ కాలంలోనే ఫోన్లు రికవరీ చేసి తమకు అందచేయడంతో బాధితులు జిల్లా ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలిపి ఆనందని వ్యక్తపరిచారు.