గోమాతను దైవంగా భావిస్తారు రైతులు.. అలాంటి గోమాత ఈనింది అంటే అదో వేడుకగా భావిస్తారు. సాధారణంగా ఆవు ఒక దూడకు జన్మనిస్తుంది. ఆ బుబ్జి దూడను చూసి రైతు మురిసిపోతుంటాడు. అయితే ఓ గోమాత తన యజమానికి సింగిల్ కాదు డబుల్ కాదు ఏకంగా త్రిపుల్ ధమాకా ఇచ్చింది. ఒకే విడతలో మూడు దూడలకు జన్మనిచ్చింది. మూడు దూడలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయి.