Good Luck Idols: ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో బుడితి అనే చిన్న గ్రామం ఉంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. పెళ్లిళ్ల సీజన్ అంటే.. ఆ గ్రామం కళకళలాడుతుంది. పండగల సమయంలోనూ ప్రత్యేకంగా నిలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి దేవాలయాలు వెలిసినా.. ఈ గ్రామానికి డిమాండ్ ఉంటుంది.. ఎందుకంత డిమాండ్ అంటే ఇక్కడ అన్ని రకాల విగ్రహాలను తయారు చేస్తారు.
దేవాలయాల్లో ప్రతిష్టించే దేవీదేవతా మూర్తుల విగ్రహాలు, గంటలు, కలశాలు, చెంబులు సహా అనేక రకాల వస్తువులు, గ్ళహాలంకరణ కోసం వాడే విగ్రహాలు, తెలుగువారి ఇళ్లలో పెళ్లిళ్ల సందర్భంగా ఇచ్చే సారె సామాన్ల కోసం అనేక వస్తువులను పంచలోహ మిశ్రమాలతో ఇక్కడ అలవోకగా తయారు చేస్తారు. ముఖ్యంగా సారెసామాన్లుగా ఇక్కడి బిందెలు, వంట పాత్రలు వెళ్తుంటాయి.
అందమైన కంచు, రాగి, ఇత్తడి విగ్రహాలు వాటికి తోడు వివాహాలకు అవసరమై పాత్రల తయారీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు.. ప్రపంచం మొత్తం ఇక్కడి రకరకాల విగ్రహాలకు, పాత్రలకు ముగ్ధులు అవుతారు. అయితే ఒకప్పుడు సాధారణంగా ఇక్కడ ఒకప్పుడు దేవుడి ప్రతిమలకు.. లేదా పెళ్లిలకు అవసరమైన వస్తువుల తయారీకి ఎక్కువ డిమాండ్ ఉండేది.
అందుకు ప్రధాన కారణం ఏంటంటే..?
చాలామంది ఆర్థిక లేక.. కుటుంబ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ఆదాయం ఎంత వచ్చినా రూపాయి కూడా మిగలదు.. నిత్యం ఖర్చులు పెరుగుతుంటాయి. దీంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే వీటికి పరిష్కారాలు వాస్తు శాస్త్రంలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా డబ్బు సంపాదించడానికి వాస్తు శాస్త్రంలో (Vastu Shastra) కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు. కొన్ని ప్రత్యేక విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లో అష్టఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని చెబుతున్నారు.
ఏనుగు విగ్రహం ఉంచితే..
అందులో మొదటిది ఏనుగు విగ్రహం.. ఇంట్లో రోజువారీ గొడవలు ఉన్నా, ప్రశాంతత కరువైనా..? ఆ సమస్యల నుంచి బయట పడడానికి ఇంటికి వెండి లేదా ఇత్తడి ఏనుగు విగ్రహాన్ని (elephant idol) తీసుకురావలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇది ఇంటి రాహు దోషాన్ని తో తొలగించడంతోపాటు అపారమైన సంపదను ఇస్తుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే నివసించేలా చేస్తుంది అంట.
తాబేలు విగ్రహం ఉంటే..
హిందూ మతంలో తాబేలు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. తాబేలను విష్ణువు స్వరూపంగా కొలుస్తారు. వాస్తుప్రకారం, ఏదైనా లోహంతో చేసిన తాబేలు విగ్రహాన్ని (turtle idol) ఇంటికి తెస్తే..దానిని తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచాలి. మీరు ఈ విగ్రహాన్ని ఇంటి డ్రాయింగ్ రూమ్లో కూడా ఉంచవచ్చు. దీంతో మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది అని సూచిస్తున్నారు.
చేప విగ్రహం పెడితే..
వాస్తు ప్రకారం, ఇంట్లో వెండి లేదా ఇత్తడి చేప విగ్రహాన్ని (fish idol) ఉంచడం వల్ల కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఈ విగ్రహాన్ని ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి. దీంతో మీకు అనేక మార్గాల ద్వారా డబ్బు వస్తుంది. ఇంట్లో ఆనందం పెరుగుతుంది. ఇప్పుడు చాలామంది ఈ వాస్తు టిప్స్ ను ఫాలో అవుతున్నారు. అందుకే చాలా మార్కెట్లలో ఈ మూడు విగ్రహాలకు భారీగా డిమాండ్ ఉంటోంది.