TTD: కలియుగ ప్రతక్ష దైవం శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు కన్నుల పండుగగా సాయి. వేలదా మంది భక్తుల సమక్ష్యంలోని.. హైదారాబద్ లో ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. తిరుమలలో ఏఏ సేవలు.. నిత్య కైంకర్యాలు ఉంటాయో అవన్నీ నిర్వహించారు. నేరుగా వాటిని దర్శించుకునే భాగ్యం భక్తులకు కల్పించారు.
శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్నివేలాది మంది భక్తజనం ప్రత్యక్షంగా తిలకించి.. వారందరి గోవిందనామ స్మరణతో స్టేడియం మార్మోగింది.
అంతకుముందు సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు సహస్రదీపాలంకార సేవలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు భక్తులను కటాక్షించారు. రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు తోమాల సేవ, అర్చన, నివేదన నిర్వహించారు.
శ్రీవారి సేవలు.. కైకంర్యాల్లో పాల్గొనే అవకాశం అందరి భక్తులకు కల్పించాలనే లక్ష్యంతోన ఇలా వివిధ ప్రాంతాల్లో వైభవోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో అంతకుముందు నెల్లూరులో జరిగిన ఈ వైభవోత్సవాలు ఊహించినట్టే ఘనంగా జరిగాయి. దీంతో ఈ ఉత్సవాలను.. మరిన్ని ప్రాంతాల్లో జరిపేందుకు టీటీడీ సిద్ధమైంది.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి దంపతులు, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్, ఈఓ ఎవి.ధర్మారెడ్డి, దాతలు శ్రీ హర్షవర్ధన్, ఎస్ఎస్.రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. భక్తుల నుంచి వచ్చిన స్పందన చూసి అంతా ఆనందం వ్యక్తం చేశారు.