వరల్డ్ వైడ్ గా సినీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Movie) విడుదలకు సిద్ధమైంది. శుక్రవారం రిలీజ్ కాబోతున్న మూవీ కోసం ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) లో ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ టికెట్ల (RRR Movie Tickets) కోసమే చర్చ జరుగుతోంది.
రెండు రాష్ట్రాల్లోనూ టికెట్ల ధరలు పెంచుకునేందుకు ఆయా ప్రభుత్వాలు అనుమతివ్వడంతో టికెట్ల ధర అమాంతం పెరిగిపోయింది. కొన్నిచోట్ల ఒక్కో టికెట్ వెయ్యి నుంచి రూ.1500 వరకు అమ్ముతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఒక్కో టికెట్ పై రూ.75 వరకు పెంచుకోవచ్చని అనుమతులివ్వడంతో నేరుగా కాకుండా బ్లాక్ లో ధరలు భారీగా పెంచేశారు.
ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సందర్భంగా థియేటర్ల భద్రత యాజమాన్యాలకు తలనొప్పిగా మారింది. భీమ్లా నాయక్, రాధేశ్యామ్ సినిమాల సందర్బంగా అభిమానుల అత్యుత్సాహికి స్క్రీన్లు దెబ్బతినడంతో యాజమాన్యాలు అలర్ట్ అయ్యారు. విజయవాడ అన్నపూర్ణ థియేటర్లో స్ర్కీన్ దగ్గరకు ఎవరూ వెళ్లకుండా ప్లై ఉండ్ షీట్ పై మేకులు కొట్టించారు.