శ్రామిక్ రైళ్లలో సౌత్ సెంట్రల్ రైల్వే కొత్త రికార్డు
శ్రామిక్ రైళ్లలో సౌత్ సెంట్రల్ రైల్వే కొత్త రికార్డు
వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించడంలో దక్షిణ మధ్య రైల్వే తమ వంతు పాత్రను పోషిస్తోంది. మే 1 నుంచి ఇప్పటి వరకు 2,41,768 మంది వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు చేర్చింది.
వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించడంలో దక్షిణ మధ్య రైల్వే తమ వంతు పాత్రను పోషిస్తోంది. మే 1 నుంచి ఇప్పటి వరకు 2,41,768 మంది వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు చేర్చింది.
2/ 5
గత వారం రోజుల్లోనే సుమారు లక్ష మందికి పైగా వలస కార్మికులను గమ్యస్థానాలకు చేర్చింది. తొలి లక్ష మందిని 16 రోజుల్లో సొంత రాష్ట్రాలకు చేర్చింది. రెండో లక్ష మందిని వారం రోజుల్లోనే ఇళ్లకు చేర్చింది.
3/ 5
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటి వరకు 196 శ్రామిక్ రైళ్లను నడిపింది. కేవలం 12 గంటల్లోనే 43 రైళ్లను నడపడం ద్వారా కొత్త రికార్డు నెలకొల్పింది.
4/ 5
తెలంగాణ నుంచి 1.5 లక్షల మందిని, ఆంధ్రప్రదేశ్ నుంచి 65,000 మందిని దక్షిణ మధ్య రైల్వే తరలించింది.
5/ 5
సమగ్రమైన ప్రణాళికతో , సయోధ్య చేసుకుంటూ రైళ్లు నడపడం వల్ల ఎలాంటి ఇబ్బంది రాలేదని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.