భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. నేడు మరో మైలురాయిని చేరింది. ఓ ప్రైవేట్ కంపెనీ నిర్మించిన తొలి రాకెట్‌ను నేడు నింగిలోకి విజయవంతంగా పంపింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ రాకెట్ ప్రయోగించారు. ఇవాళ ఉదయం 11.30 గంటలకు షార్ లోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి అది నింగిలోకి దూసుకెళ్లింది.